July 21, 2022

జయ జయ జయ ప్రియ భారత

Posted in Poem, Telugu at 4:53 pm by itsourteamwork

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుస్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా జయ

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయౌ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ జయ

December 23, 2018

భారత చరిత్ర

Posted in Misc at 8:07 pm by itsourteamwork

భారత చరిత్ర

బ్రిటిష్ వాళ్ళు 17వ శతాబ్దంలో భారతదేశంలోని భాషలు, సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేయడానికి (పరిపాలనా సౌలభ్యం కోసం) కలకత్తాలో ఒక సంస్థను ఏర్పాటు చేసారు. విశేష కృషి చేసి భారతదేశ చరిత్రను తవ్వి నిజాలను వెలికి తీసారు. కానీ నిజాలను బయటికి పోక్కనీయకుండా జాగ్రత్త పడి బూటకపు కథలు ప్రచారం చేసారు.

క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం సిందు నది లోయ ప్రాంతంలో గొప్ప నాగరికత విలసిల్లినది అనే విషయం వాళ్ళు దాచినా దాగని నిజం. అయితే ఎక్కడినుంచో వచ్చి సిందు ప్రజలపై ఆర్యులు దాడి చేయడం వల్ల సింధు నాగరికత అంతరించిందనేది పచ్చి అబద్దం.

హరప్పా, మొహంజొదారో నగరాలపై దాడులు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎటువంటి యుద్ద పరికరాలు కానీ, నిర్మాణాలపై డామేజ్ చేసిన ఆనవాళ్ళు కానీ బయటపడలేదు. దాడివల్ల మరణించిన ఆస్థిపంజరాలు నగరంలో లేదా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లభించలేదు. అంతే కాకుండా అదే కాలానికి చెందిన హోమ కుండాలు, యజ్ఞ వాటికలు ఇంద్రుని, సూర్యుని ఆరాధించిన అనవ్వాళ్ళు లభించాయి.

బ్రిటిష్ చరిత్రకారుల ప్రచారాల ప్రకారం యజ్ఞ యాగాలు నిర్వహించింది ఆర్యులు. వారు క్రీ. పూ. 1500 లో భారతదేశంలోకి అడుగిడిన ఆర్యులు క్రీ. పూ. 3000లో భారత దేశ వ్యాప్తంగా యజ్ఞ యాగాదులు ఎలా నిర్వహించారు?

సింధు నాగరికత అని బ్రిటిష్ వారు వేరు చేసి చెప్పిన ఆ నాగరికత కరువు పరిస్థితుల వల్ల అంతమయింది. వీరు ఆ కాలంలో సరస్వతి నది అనే ఒక నది ఉండేది. ఆ నది నెమ్మదిగా తన దిశ మార్చుకుంది (నదులు దిశ మార్చుకుంటాయి.). క్రమేపి అంతిరిచిపోయింది. అందువల్ల నీటి సౌకర్యం లేక నగరాలను వదిలి వలసలు వెళ్లారు. ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లు విడిచి వెళ్ళలేని కొద్దిమంది సెంటిమెంట్ కొద్ది అక్కడే ఉండి మరణించారు. అలా సిందు నాగరికత అంతమయింది. ఈ విషయం ఋగ్వేదంలో వివరంగా ఉంది.
కానీ బ్రిటిష్ వారు చెప్పినదాని ప్రకారం ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించాక క్రీ. పూ. 1500లో ఋగ్వేదాన్ని రచించారు. క్రీ. పూ. 1500 లలో గ్రంధం అయితే, క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రిందటి సరస్వతి నదికి సంబంధించిన ప్రస్తావన రుగ్వేదంలో ఎలా వచ్చి చేరింది?

ఆర్యులు వచ్చేసరికి సింధు నదీలోయ ప్రాంతంలో నల్లని, పొట్టివారు ఉండేవారు, వారిని ఆర్యులు “దశ్యులు” , అనాగరికులు అనేవారు అని బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేసారు . వారే (దశ్యులే) భారత “మూల పురుషులు” అని తప్పుడు ప్రచారాలు చేసారు. సిందు ప్రజలు అనాగరికులు అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాగరికత ఎలా అయింది?

కానీ పర్షియన్లు సిందు ప్రజలనుండి వచ్చిన చీలిక. వీరు సింధు ప్రజలతో విభేదించి పర్షియా ప్రాంతానికి వలస వెళ్లారు. వారు స్థాపించుకున్న మతం “జోరాస్ట్రియన్” మతం. వాళ్ళ మత గ్రంధం “జెండావెస్తా” లో ఈ విషయం వివరంగా ఉంటుంది. అంటే వీళ్ళని (పర్శియన్లని) “దశ్యులు” అని ఈ గ్రంధం తెలియ చేస్తుంది. మరి పర్షియన్లు “నల్లగా పొట్టిగా ఉండరు. ఎర్రగా ఎత్తుగానే ఉంటారు”.

ఇప్పుడు భారత దేశానికి ” మూల పురుషులు ఎవరు? బయటినుంచి వచ్చి ఎవరు దాడులు చేసారు?

బ్రిటిష్ వాళ్ళు కొన్ని సామజిక వర్గాల వారిని రెచ్చగొట్టి చీలికలు తీసుకువచ్చేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసారు.

ఇకపోతే ఈ దేశంలో అధికారం చెలాయిస్తున్నవారు బయటినుంచి వచ్చిన వలసవారు అని, ఈ దేశంలో వారికెంత హక్కు ఉందో వాళ్ళలా వలస వచ్చిన మాకు కూడా అంత హక్కు ఉంది అని ప్రచారం చేయడం కోసం భారత దేశ ఘన చరిత్రలోని నిజాలను తుంగలో తొక్కారు.

December 20, 2018

“భారతదేశంలో పరమత సహనం తగ్గిపోతోందో” అని ఏడ్చిపోయేవాళ్ళు ఇది తప్పక చదవాలి.

Posted in Misc at 8:05 pm by itsourteamwork

“భారతదేశంలో పరమత సహనం తగ్గిపోతోందో” అని ఏడ్చిపోయేవాళ్ళు ఇది తప్పక చదవాలి.

ఖలాఫ్ అల్-హర్బీ సౌదీ అరేబియాకి చెందిన స్వతంత్ర భావాలు కల కమ్యూనిస్టు మేధావి. పలు విషయాలపై అతడు తన రచనలలో వెలిబుచ్చిన భావాలు ఎన్నో దేశాలలో చర్చనీయాంశాలు అయ్యాయి.

ఇటీవల “సౌదీ గెజెట్” పత్రికలో తాని వ్రాసిన ‘India – A country that rides elephants’ వ్యాసంలో భారతదేశాన్ని అత్యంత సహనశీలియైన దేశంగా పేర్కొన్నాడు. భారతీయుల మనోవైశాల్యాన్నే కాదు, అరబ్బుల సంకుచిత ధోరణిని కూడా ఆ వ్యాసం చదివితే అర్థం అవుతుంది. ఆ వ్యాసంలో అతడు ఇలా పేర్కొంటాడు.

“భారతదేశంలో వంద కన్నా ఎక్కువ మతాలున్నాయి. వందకన్న ఎక్కువ భాషలున్నాయి. అయినా అక్కడి ప్రజలు ఎంతో సంయమనంతో శాంతియుత జీవనం సాగిస్తున్నారు. బట్టలు కుట్టుకునే సూది దగ్గర్నుంచీ అంగారక గ్రహంపైకి పంపించిన ఉపగ్రహం వరకు ఏదైనా తయారు చేయగలిగే గొప్ప దేశంగా ఎదగడం కోసం అక్కడి వారందరూ కలసి శ్రమిస్తున్నారు.

“భారతదేశాన్ని, అక్కడి ప్రజల శాంతియుత సహజీవనాన్ని చూస్తుంటే నాకు కాస్త అసూయ కలుగుతుంది. ఎందుకంటే నేను ఒకే మతాన్ని పాటించే, ఒకే భాషను మాట్లాడే దేశంలో జన్మించేను. ప్రజలంతా ఒకే మతానికి, భాషకు చెందిన వారైనా మా దేశంలో ఎప్పుడూ అల్లర్లు, హత్యాకాండలు జరుగుతూంటాయి.

“ప్రపంచంలో వివిధ దేశాధినేతలు శాంతి, సహనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ మతము, భాష, ప్రాంతం, వర్గం వంటి భేధాలేవీ లేకుండా అతి ప్రాచీన కాలం నుండీ శాంతియుత సహజీవనాన్ని ఆచరణాత్మకంగా ప్రపంచానికి చూపించిన దేశం ఒక్క భారతదేశం మాత్రమే.

“కానీ చాలా దేశాలలో ఈ వాస్తవాన్ని ప్రక్కనపెట్టి భారతదేశాన్ని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దేశంగానే ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా అసమంజసమైనది, అవాస్తవమైనది.

“ఈ భూమండలంపై అత్యంత సహనం గల ఏకైక దేశం ఒక్క భారతదేశం మాత్రమే.

“పెట్రోలియం యుగం ప్రారంభం కాక ముందు అరబ్బు దేశాలు చాలా పేద దేశాలు. అప్పుడు అరబ్బులమైన మన దృష్టిలో భారతీయులంటే చాలా ధనవంతులు, నాగరికులు. కానీ ధనవంతులైన మరుక్షణం మన దృష్టిలో భారతదేశం అంటే పేదరికంలో మగ్గిపోతూ వెనుకబడిపోయిన దేశం ఎలా అయిపొయింది? ఇలా భారతదేశం పట్ల క్షణాలలో మన అభిప్రాయం మారిపోవడంలో ఔచిత్యం ఏముంది?

“అసలు మనమెప్పుడూ భారతీయులు పేదవారా, ధనికులా అనే ఆలోచిస్తుంటాం. నిజంగా మనకు జ్ఞానం ఉంటే పరస్పర విరుద్ధమైన ఆదర్శాలను, ఆలోచనలను ఎలాంటి భావోద్వేగాలు, సంశయాలు లేకుండా స్వాగతించి, విభిన్న ఆలోచనలు కలవారితో వందల సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తూన్న భారతదేశం నుండి మనం ఎంతో నేర్చుకుని ఉండేవారం.

“ఒకవేళ మొత్తం అరబ్బు దేశాలలో ఉన్నవారందరినీ భారతదేశానికి తరలించినట్లయితే వారంతా భారతదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతారు. మానవత్వం అనే మహాసాగరంలో ఎలాంటి భయసంకోచాలూ లేకుండా వారు కలిసిపోగలరు. వారిలోని జాత్యహంకారం పూర్తిగా లయమైపోతుంది. ఈ ప్రపంచంలో అన్నదమ్ముల్లా బ్రతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం ఏమాత్రం సమ్మతం కాదని తెలుసుకుంటారు.

“భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం. మత, జాతి, ప్రాంత, భాషా భేదాలంటే భారతీయులకు తెలియదు. ఎందుకంటే వైవిధ్యాలతో సహజీవనం చేయగలిగే లక్షణం వారి జన్యువులలోనే ఉంది సహజంగా.

“భారతీయులు ఏనాడూ పేదవారి పట్ల రోత, ధనికుల పట్ల ద్వేషము చూపలేదు.

భారతీయులు చాలా గొప్పవారు. వారిలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఎవరూ దీనిని త్రోసివేయలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అందుకు వారిలో భారతీయుల పట్ల కల ఈర్ష్యయే కారణం. దానికి వారు ఎంతో సిగ్గుపడాలి.

“ఒకవేళ అరబ్బులే భారతదేశానికి వెళ్తే భయపడాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు భారతీయుల మనసులను ఎక్కడ కలుషితం చేస్తారోనన్నదే. వారు భారతీయులలో మతపరమైన, ప్రాంతీయపరమైన విద్వేషాలకు ఎక్కడ ఉసిగొల్పుతారన్నదే. అంతేకాదు భారతీయులలో గల వైవిధ్యాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత వరకు రెచ్చగొడతారు కూడా.”

December 6, 2018

మన మహనీయులు ఆదిశంకరులు

Posted in Misc at 8:03 pm by itsourteamwork

మన మహనీయులు ఆదిశంకరులు      

మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన  మహానుభావులు జగద్గురు ఆది శంకరాచార్య వారి గురించి సమగ్ర సమాచారం మీకోసం చదివిన వారు నిజంగా అదృష్టవంతులే ఆయన శుభాశీస్సులు ఎల్లప్పుడూ మన అందరికీ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…                              

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి. మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు. శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు. బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు. తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము

భాసిల్లుతున్నాయి. శంకరుల రచనలు:      

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు. ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు. విష్ణు షట్పది:       మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే

పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము. సాధనా పంచకము: ,       శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు. దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు – వేదములను అధ్యయనం చేద్దాము – అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన – ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము – మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా – ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును

తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము. శివ సువర్ణమాలా స్తుతి:         యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ – నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది. ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి – తోటకాష్టకము:                  ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది. శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో ‘వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం’ అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు. ముగింపు:    ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.

⁠⁠⁠⁠

November 30, 2018

సిందూరం – అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

Posted in Misc at 7:59 am by itsourteamwork


అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా

శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి

ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం

వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని

తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని

కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం

చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

November 28, 2018

స్వయం కృషి

Posted in Misc at 7:57 pm by itsourteamwork

స్వయం కృషి

కూలీ కాంట్రాక్టర్… ఇప్పుడు 15 కంపెనీల ఛైర్మన్

విజయం ఊరికే సొంతం కాదు. కష్టపడాలి, మనస్సుపెట్టాలి, అదే జీవితంగా బతకాలి, నిద్రాహారాలు మాని ఎన్నిఆటుపోట్లు వచ్చినా ఎదురెళ్లి ఢీకొట్టాలి.. అప్పుడే విజయలక్ష్మి వరిస్తుంది. మనం అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఊరికే ఎవరూ పారిశ్రామికవేత్తలు అయిపోలేరు. అది కూడా నలుగురికీ ఆదర్శంగా నిలబడగలిగే స్థాయి రావడం అంత సులువైన వ్యవహారమూ కాదు.
తాపీ కూలీ, వాచ్ మెన్, కేబుళ్ల కోసం గుంతలు తవ్వే కూలీలా జీవితాన్ని ఆరంభించిన ఓ 22 ఏళ్ల కుర్రాడు… తానో వంద కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి ఛైర్మన్ అవుతానని ఊహించగలడా ? మారుమూల పల్లెల్లో రెండు గ్లాసుల దురవస్థను అనుభవించిన ఆ యువకుడు.. ఇప్పుడు సమాజంలో ఓ ఉన్నతమైన స్థానానికి చేరుకోగలడని విశ్వసించగలడా ? సాధారణంగా అయితే ఇది సినిమాల్లో మాత్రమే నిజమవుతుంది. ఓ పాట అయిపోయేలోపు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో హీరో పూరి గుడిసె నుంచి బంగళాలోకి మారిపోతాడు. కానీ రియల్ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు అసాధ్యమే అయినా అక్కడక్కడా.. తారసపడొచ్చు. మీరు ఇప్పుడు చదవబోయేది కూడా అలాంటి కథనమే. కేవలం డిప్లమా చదివిన వ్యక్తి.. అష్టకష్టాలు పడి.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తించే స్థాయికి ఎదిగాడు. రూపాయి రూపాయి పోగేస్తూ.. కష్టాన్ని నమ్ముకుని… ఒక్కో ఇటుకతో కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. అతనే మన్నెం మధుసూధన్ రావు. ఎంఎంఆర్ గ్రూప్ ఛైర్మన్. ఓ కుగ్రామం నుంచి వచ్చి కార్పొరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సక్సెస్‌ఫుల్ అండ్ ఇన్‌స్పైరింగ్ ఆంట్రప్రెన్యూర్.

మధుసూధన్ రావుది.. ప్రకాశం జిల్లా.. కందుకూరులోని పాలుకూరు గ్రామం. తండ్రి పేరయ్య, తల్లిరాములమ్మకు పుట్టిన ఎనిమిది మంది సంతానంతో ఐదోవాడు ఇతను. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండేది వీళ్ల పూరిగుడిసె. మగాళ్లెవరూ మోకాళ్లను దాటి పంచెను కిందికి కట్టకూడదు. ఆడవాళ్లు జాకెట్లు కూడా వేసుకోకూడదు. ఏరా.. ఓరేయ్.. ఒసేయ్.. ఇవీ.. వీళ్లకు ఊరిజనాలు ఇచ్చిన పేర్లు. తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందేమైనా ఉందీ.. అంటే.. అది పేదరికం, పాలేరు పని, తాపీ పని. తల్లి పొగాకు గ్రేడింగ్ కూలీ. ఇంట్లో అంతా పనిచేస్తే తప్ప.. పూటగడవని స్థితి. ముప్పుటలా తాగేది, తినేది… గంజి, జొన్న సంగటి. అలాంటి వాతావరణంలో పుట్టిపెరిగాడు మధుసూధన్. ఆరవ తరగతి వరకూ ఊళ్లోని చదువు. అంత మందిని సాకడం.. ఆ తండ్రికి భారమైంది. ఇంట్లో నలుగురు ఆడపిల్లలు. అయినా సరే.. ఇద్దరు కొడుకులనైనా కనీసం చదివించాలనే కోరిక తల్లిదండ్రులది. అందుకే ఇంట్లో మిగిలిన ఎనిమిది మందీ… చేసిన త్యాగం మధుసూధన్‌ను అతని అన్న మాధవ్‌ను చదివేలా చేసింది. ఇంట్లో తిండికి కూడా ఇబ్బందికావడంతో అన్నాదమ్ముల మకాం సంక్షేమ హాస్టళ్లకు మారింది. అక్కడైనా ముప్పూటలా తిండి దొరుకుతుందన్న వీళ్ల ఆశ అడియాసే అయింది. ప్లేట్లో మగ్గిజ పోసుకుంటే.. పురుగులన్నీ బయటకు తేలేవంటూ తన దుర్భర జీవితాన్ని గుర్తుచేసుకున్నారు మధుసూధన్. వేరే గత్యంతరం లేక అక్కడే చదువుతూ టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఆ తర్వాత బిటెక్ చేసే అవకాశం వచ్చినా.. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అన్న అప్పటికే బిటెక్ చుదువుతుండడంతో తాను ఆ అవకాశాన్ని వదులుకుని పాలిటెక్నిక్‌ చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
తాపీ చేతపట్టాల్సి వచ్చింది
పాలిటెక్నిక్, బిటెక్ అయిపోయి.. హైదరాబాద్ రాగానే.. ఉద్యోగం కన్ఫర్మ్ అని అన్నాదమ్ములు అనుకున్నారు. కానీ అదంత సులువు కాదని అప్పుడే అర్థమైంది. అలా అని ఊరు వెళ్లలేని పరిస్థితి. కొడుకులు ఇద్దరూ పట్నం పోయి ఏదో ఒకటి సంపాదించి అందరినీ ఆదుకుంటారని అక్కడ వాళ్లంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడేమో ఉద్యోగం దొరకని స్థితి. రోజులు గడుస్తున్నాయి.. చేసేది లేక ఇక్కడే కూకట్‌పల్లిలో నిర్మాణ కూలీగా ఉన్న అక్కాబావల దగ్గరికి వచ్చారు. ఆ ఇంట్లో ఇద్దరు కూర్చోలేరు.. ఒకరు పడుకోలేరు. అలాంటి దీనస్థితి వాళ్లది. ఎలాగోలా వాళ్లను ఒప్పించి కొద్దిరోజులు అక్కడే ఉండి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఫలితమేదీ లేదు. చేసేది లేక తమకు వచ్చిన తాపీ పనిలో దిగారు. అక్కాబావతో కలిసి కూలీకి వెళ్లి రోజుకింత సంపాదించుకున్నారు. చదివింది బిటెక్, పాలిటెక్నిక్ అయినా.. మొహమాట పడలేదు. తమ గురించి ఊళ్లో ఎదురుచూస్తున్న కుటుంబానికి ఎంతో కొంత ఇక్కడి నుంచి పంపించాలనే తపనే వాళ్లలో కనిపించింది. అలా తన ప్రస్థానం తాపీ కూలీగా మొదలైంది.
” తినడానికి తిండిలేదు. ఉండడానికి జాగాలేదు. నిర్మాణం కోసం పెట్టిన ఇసుకలో సిమెంట్ సంచీలు వేసుకుని రాత్రిళ్లు పడుకున్నాం. రోజులో ఒకే పూట భోజనం. అది కూడా మధ్యాహ్నమే తినేవాడిని ఎందుకంటే.. అప్పుడైతే రాత్రిపూట ఆకలి అంతగా ఉండదని. మే నెల ఎండల్లో చెప్పులు లేకుండా ఎన్నిసార్లు.. ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటానో లెక్కేలేదు. ఊరికి వెళ్లలేము. ఇక్కడ బతకలేము. ఎలారా భగవంతుడా.. అని గుండెపగిలేలా ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలుసు. ఇప్పటికీ ఈ రోజులు తలుచుకుంటే.. ఏదో తెలియని బాధ, ఆక్రోషం వస్తుంది. ”

కూలీ కాంట్రాక్టర్
ఒకరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా… ఓ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లారు ఎంఎంఆర్. అక్కడా నిరాశే. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు చెవిన పడడం.. అతని జీవితాన్నే మార్చేస్తాయని అనుకోలేరు. తాము చేస్తున్న టెలికాం కేబుల్ పనికి కూలీలు దొరకడం కష్టంగా ఉందని, దీని వల్ల పనులు బాగా ఆలస్యమవుతున్నాయనేది ఆ మాటల సారాంశం. తమ ఊళ్లో, ఇంటిదగ్గరా.. చాలామంది పనిలేక ఇబ్బంది పడడాన్ని గమనించారు మధుసూధన్. వాళ్లందరినీ తీసుకువచ్చి నేనే ఆ పని ఎందుకు చేయించకూడదు అని అనుకున్నాడు. వాళ్లు ఏమనకుంటారు, అసలు తనను నమ్ముతారో లేదో.. అనే సంశయం ఏదీలేకుండా.. తనకు ఈ పని అప్పగించమని ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. ముక్కూమొహం తెలియని తనకు ఆ పనిని ఇవ్వడం కుదరని వాళ్లూ తెగేసి చెప్పారు. అయినా పదే పదే అడగడంతో సరేనన్నారు. అడ్వాన్స్ ఏమీ ఇవ్వబోమని.. రాత్రికి కూలీలను సైట్‌కు తీసుకువస్తే చూద్దామని చెప్పి పంపించేశారు. జీవితంలో తానేదో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాననేంత ఆత్మవిశ్వాసం.. ఒకవైపు.. రాత్రికి కూలీలందరినీ అడ్వాన్స్ లేకుండా ఎలా తీసుకురావాలనే ఆందోళన మరోవైపు.

ఇప్పుడా నగరంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే.. కేవలం అక్క మాత్రమే. ఆమెను ఓ మూడు వేలు సర్దమని, రాత్రికల్లా పేమెంట్ వచ్చేస్తుందని ఒప్పించే ప్రయత్నం చేశాడు. తమ్ముడిపై నమ్మకంతో.. ఓ పదిమందిని అడిగి కేవలం 900 పట్టుకొచ్చింది వాళ్ల అక్క. అదే తన వ్యాపారానికి మొదటి పెట్టుబడి. ఇక ఆలస్యం చేయకుండా.. ఓ చిన్న వాహనాన్ని అద్దెకు తీసుకుని.. దగ్గర్లో ఉన్న బస్తీలకు వెళ్లి ఓ పదిహేను, ఇరవై మందిని ఎలాగోలా పనికి ఒప్పించాడు. వాళ్లను సైట్‌కు తీసుకువచ్చి రాత్రిపూట భోజనం, టీ ఇప్పించాడు. ఇప్పుడు తన పనేంటంటే.. ఆ కూలీలతో రాత్రిపూట గుంతలు తవ్వించి టెలికాం కేబుళ్లను లాగడం. 100 మీటర్ల ఆ పనికోసం ఆ రాత్రంతా తానూ పనిచేశాడు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ కావడంతో.. ఆ పనులన్నీ వెంటనే పట్టేశాడు. మొదటి రోజు తాను చేసిన ఆ పనికి మధుసూధన్‌కు వచ్చిన ఆదాయం రూ.20 వేలు. ఖర్చులుపోగా బాగానే మిగిలింది. ఈ రోజే అక్కతో కలిసి కడుపు నిండా భోజనం చేశాడు. చాలాకాలం తర్వాత… !

దశ తిరిగింది
మధు పనితనం నచ్చి.. టాటా టెలీసర్వీసెస్‌ పనులు చేసే ఓ కాంట్రాక్టర్‌ సబ్ కాంట్రాక్ట్ పనులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కూలీలను సైట్లను తీసుకువచ్చి వాళ్లతో పనులు చేయించడం ఇతని పని. మెల్లిగా ఒక్కోటి నేర్చుకుంటూ.. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేయింగ్‌లో పూర్తిస్థాయి ప్రావీణ్యత సంపాదించారు. అప్పట్లోనే టాటా సహా.. అనేక టెలికాం కంపెనీల సబ్ కాంట్రాక్ట్ పనులు చేయడం మొదలుపెట్టారు. ఇక వెనక్కి తిరిగి చూసుకునేది లేదని.. దూసుకుపోయారు. ఎక్కుతొలిమెట్టు.. కొట్టు.. కొండను ఢీకొట్టు అనేంత కాన్ఫిడెన్స్‌ మధులో కనిపించింది. వందల మంది కార్మికులను ఊళ్లు, పల్లెల్ల నుంచి తీసుకురావడం.. వాళ్ల బాగోగులు చూసుకుని.. వాళ్ల పొట్టకొట్టకుండా న్యాయంగా సంపాదించడం మొదలుపెట్టాడు. అలా 20 వేల కాంట్రాక్టర్ స్థాయి నుంచి రెండేళ్లలోనే రెండు కోట్లకు ఎదిగారు. ఈ లోపు మధు అన్నకు కూడా బిఎస్ఎన్ఎల్‌లో మంచి ఉద్యోగం లభించింది.
విలన్ ఎంట్రీ
కుర్రాడి దూకుడు చూసి.. ఓ వ్యక్తి చేరదీశాడు. నీకున్న కెపాసిటీకి చిన్న ఆర్డర్లేంటి… నాతో చేయి కలిపితే స్టేట్ మొత్తం దున్నేయొచ్చని నమ్మించాడు. ఇందుకోసం ఓ కంపెనీని ఫ్లోట్ చేద్దామని చెప్పడంతో.. మధు కూడా పూర్తిగా నమ్మేశాడు. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టేయడం.. తన డబ్బంతా.. అతడికి అప్పగించడం చేసేశాడు. తీరా ఏడాది తర్వాత.. ఒకసారి డబ్బు అవసరముందని.. వెళ్తే.. కంపెనీ నష్టాల్లో ఉందని.. పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పడంతో.. అతని కాళ్ల కింది భూమి కదిలినంత పనైంది. ఇంతకాలం పడిన కష్టం మొత్తం ఒక్కమాటతో చెదిరిపోయింది. ఎక్కువ మాట్లాడితే.. ఏమైనా చేయగలమని బెదిరించాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా బాధపడి.. చేసేదిలేక మిన్నకుండిపోయారు. అంగబలం.. అర్థబలం రెండూ లేకపోవడంతో చేసేదిలేక వెనుదిరిగారు.
” వాళ్లు చేసిన మోసంతో నేను కోల్పోయిందేమీ లేదు. నా కష్టమే పోయింది. పోతేపోయింది. వయస్సుంది.. తెలివి ఉంది. ఆ మాత్రం సంపాదించుకోలేనా ? లేబర్‌కి ఇవ్వాల్సిన డబ్బులంతా సెటిల్ అయిపోయింది. నష్టపోయింది నా లాభమే. ఇది జీవితంలో పెద్ద అనుభవం. అందుకే ఎవరినీ ఊరికే నమ్మసేయొద్దు అనే ఖరీదైన అనుభవం తెలిసొచ్చింది ”
మళ్లీ జీరో స్థాయికి
డబ్బూ పోయింది. దీనికి తోడు బెదిరింపులు. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. ఎక్కువకాలం బాధపడితే ప్రయోజనం లేదని.. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ పదివేల రూపాయల జీతం. అది కూడా టెలికాం కంపెనీలకు చెందిన కేబులింగ్, మెయింటెనెన్స్ పనులు చేసే సంస్థే. అతి తక్కువ కాలంలోనే.. మేనేజ్‌మెంట్ మనసు దోచాడు. పది రూపాయల్లో అయ్యే పనిని ఏడెనిమిదికి చేసి చూపించి వాళ్లకు నాలుగు రూపాయలు మిగిలేలే చేసేవాడు. ఐదారు నెలలకే జీతం 23 వేలకు పెరిగింది. ఈ లోపు జీవితంలో ఓ తోడు కావాలని వివాహం చేసుకున్నారు. అయితే ఇంట్లో మాత్రం తనకు 16వేలే జీతమని చెప్పారు. ఎందుకంటే.. ఆ ఏడు వేల రూపాయలను దాచి తన సొంత కంపెనీ పెట్టుకోవాలనే ఆలోచన అప్పట్లోనే ఉండేది.
అయితే ఈ కంపెనీ వాళ్లు కూడా చెప్పిన జీతం సరైన సమయానికి ఇవ్వకపోవడం.. ఎంత పెద్ద పనిచేసినా.. మెచ్చుకోకపోవడంతో సంతృప్తి లేక ఉద్యోగం మానేశాడు. ఈ లోపు సమర్ధులైన సిబ్బంది లేకపోవడంతో ఓ కాంట్రాక్ట్ పని మధ్యలో ఆగిపోయే స్థాయికి వచ్చింది. అది అండర్‌వాటర్‌లో కేబులింగ్ చేసే పని. ఇందులో ఎంఎంఆర్ దిట్ట. ఎక్కడైతే ఎక్కువ కష్టం ఉంటుందో.. ఎక్కడ నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయో.. ఆ పనులనే ఛాలెంజింగ్‌గా చేసేవారు. చేసేది లేక మళ్లీ మధుని పిలిపించారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం తనకే ఇస్తే చేస్తానని తెగేసి చెప్పారు. అప్పుడు వాళ్లు అందుకు ఓకె చెప్పడంతో.. మళ్లీ కాంట్రాక్టర్‌ అవతారమెత్తారు. ఇది లైఫ్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్.
సొంత కంపెనీ
ఇలా జీవితం గడిచిపోతే ప్రయోజనం లేదనిపించింది. తన దగ్గరున్న డబ్బు, భార్య తరపు వాళ్ల సహకారంతో మూడు లక్షల వరకూ పోగేశారు. 2005లో మళ్లీ కంపెనీ ప్రారంభించారు. ఇదే మధుసూధన్ రావుకు సెకెండ్ లైఫ్. అప్పటికే అనేక ఆటుపోట్లను ఎదుర్కోవడంతో జీవితానికి సరిపడా అనుభవం సంపాదించేశారు. కుటుంబంలోని వాళ్లకే కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. బంధువులనే నమ్మారు. ఒక్కో టెలికాం కాంట్రాక్టును కైవసం చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూప్.. 8 వేల కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబులింగ్, 20 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ మెయింటెనెన్స్ చేశారు. టాటా టెలీ, వొడాఫోన్, రైల్‌టెల్, ఎయిర్టెల్, విఎస్ఎన్ఎల్, జిటిఎల్, అమెరికన్ టవర్స్.. ఇలా దేశంలో ఉన్న టాప్ ఎంఎన్‌సి కంపెనీలన్నీ ఇప్పుడు అతని క్లైంట్లు. ఆంధ్ర, తెలంగాణ సహా.. వివిధ రాష్ట్రాల్లో దూసుకుపోయారు. ఒక్క రిలయన్స్, బిఎస్ఎన్ఎల్ మినహా.. దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీలకూ.. పనిచేశాడు. అయితే దళిత్ కార్డ్ ఉపయోగించి.. ఈ కాంట్రాక్ట్‌లన్నీ పొందాడని ఎవరైనా అనొచ్చని.. ఇంతవరకూ ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్ కూడా చేయలేదు. చేసినవన్నీ పూర్తిగా ప్రైవేట్ సంస్థల పనులే. ఇప్పటికీ రోజుకు 18 గంటలు కష్టపడి చేయడం.. తన తల్లి రాములమ్మని చూసి నేర్చుకున్నట్టు చెప్తారు. చిన్నప్పటి నుంచి తనకు అలవాటు మూడు పూటలా ఉన్నదేదో తినడం. ఇప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తానంటూ చెప్పడం అతనిలో ఉన్న ఆ మట్టివాసన పరిమళాన్ని, స్వచ్ఛతను తెలియజేస్తోంది.

ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ
రాజా స్కాం తర్వాత మెల్లిగా టెలికాం రంగంలో జోరు తగ్గడాన్ని గమనించారు. ఇలా ఉంటే.. ప్రయోజనం లేదని.. తన వ్యాపారాన్ని డైవర్సిఫై చేశారు. కన్‌స్ట్రక్షన్, మైనింగ్, పవర్ ప్రాజెక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి స్టాఫింగ్, ఆగ్రో.. 11 రంగాలకు తన కార్యకలాపాలను విస్తరించారు. 15 కంపెనీలను ఫ్లోట్ చేశారు. రాజమండ్రిలో 50 ఎకరాల్లో టౌన్‌షిప్ నిర్మాణం, చెన్నై మెట్రోలో కొన్ని కీలక పనులు, వైజాగ్‌లో 11 ఎకరాల్లో నిర్మాణం వంటివి తనకు కన్‌స్ట్రక్షన్ రంగంలోనూ మంచిపేరు తెచ్చాయి. ఈ సంస్థలన్నీ ఇప్పుడు వంద కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్నాయి. త్వరలో దక్షిణాఫ్రికాలో టెలికాం కంపెనీలకు అవసరమైన సేవలను అందించాలని చూస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 3జి నుంచి 4జి కన్వర్షన్‌ అవుతున్న నేపధ్యంలో దానిపై అధికంగా దృష్టి కేంద్రీకరించారు. పూణెలో ఐటి స్టాఫింగ్ సేవల కంపెనీని ఏర్పాటు చేశారు. ఆరుగురు ఐఐటి విద్యార్థులతో కలిసి ఓ ఐటి ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూపులో 300 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇప్పటివరకూ ఓ ఏడెనిమిది వేల మందికి ఉపాధిని చూపించి ఉంటారు. రాబోయే ఐదేళ్లలో తన గ్రూపు టర్నోవర్‌ను ఐదువేల కోట్లకు పెంచాలనేదే తన ఏకైక లక్ష్యం. కనీసం ఐదు వేల మందికి ఉపాధిని చూపించాలనే ఆరాటం.
ఇప్పుడు ఎంఎంఆర్‌కు నలభై ఏళ్లు. మరో ఏడేళ్లలో రిటైర్ అయిపోదామని అనుకుంటారు. అప్పుడు మెంటార్‌గా ఉంటూ.. తన ట్రస్ట్ ద్వారా సేవ చేద్దామనే ఆలోచన బలంగా ఉంది. తనలా ఎవరూ తిండికి ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దని నిశ్చయించుకున్నారు. పాతికేళ్ల నుంచి కుటుంబంతో సరిగా గడపలేకపోయానని, టెన్షన్లతోనే ఇంతకాలం సాగిపోయిందని…. అప్పుడైనా కాస్త రిలాక్స్‌డ్‌గా ఉందామనేది ఆలోచన. ఈలోపు లక్ష్యాలన్నీ పూర్తిచేసుకోవడం తనముందున్న కర్తవ్యమని చెప్తారు.
తన కోసం కష్టపడిన కుటుంబ సభ్యులందరికీ భూమి, ఇళ్లను కొనిచ్చారు. వాళ్ల పెళ్లిళ్లన్నీ చేశారు. కొంత మందిని కంపెనీలో డైరెక్టర్లుగా చేశారు. ఇప్పుడు మధు అన్న బిఎస్ఎన్ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్. భార్య కూడా జెటిఓనే. తాను సెటిల్ అయి.. అందరినీ సెటిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

పూరిగుడిసె నుంచి జూబ్లిహిల్స్
తాపీ పని చేయడానికి జూబ్లిహిల్స్ వచ్చినప్పుడు అక్కడ ఇళ్లను చూసి అతని మది చెదిరిపోయింది. ఒక్కరోజైనా ఇలాంటి ఇళ్లలో పడుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో విశాలమైన, అద్భుతమైన సిటీ వ్యూ కనిపించే ఓ ఖరీదైన ఫ్లాట్‌నే సొంతం చేసుకున్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఏపి అధ్యక్షుడిగా ఉన్నారు. తన గురించి ‘DEFYING THE ODDS’, ది రైజ్ ఆఫ్ దళిత్ ఆంట్రప్రెన్యూర్స్ అనే పుస్తకంలో ప్రధానంగా ప్రచురించారు. స్వీడిష్ ఆథర్ ‘ఇండియా అవేక్స్‌’ పేరుతో ముగ్గురు అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులపై డాక్యుమెంటరీ రూపొందించారు. వాళ్లలో ఎంఎంఆర్ కూడా ఒకరు. ఇప్పటివరకూ ప్రముఖమైన విదేశీ పత్రికలు ఎన్నో ఇతని సక్సెస్ స్టోరీని ప్రచురించాయి. ఆశ్చర్యకరంగా తెలుగు వారెవరికీ మధుసూధన్ రావు గురించి పెద్దగా తెలియదు. మొట్టమొదటి సారి యువర్ స్టోరీ ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని మీ అందరికీ పరిచయం చేస్తోంది.
”నేను విద్యార్థులకు చెప్పేది ఒక్కటే.. మీ ఊరు కానప్పుడు.. ఏ ఊరైనా మీకు ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడైనా వెళ్లి పనిచేయండి. అవకాశం మీ దగ్గరికి ఎప్పుడూ రాదు. మీరే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లండి. ఏదైనా కంపెనీ పెట్టేముందు ఆ రంగంలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగిగా పనిచేసి అనుభవం పొందండి. మీ కంపెనీలో ప్రతీ పనీ మీకు వచ్చి ఉండాలి”.

November 27, 2018

Indian Rupee was the official currency for several other Countries.

Posted in Currency, India, Misc tagged , , , , , , , , at 5:14 pm by itsourteamwork

At one point Indian Rupee was the official currency for several other Countries. Strange but true. Watch this video for more details.

November 17, 2018

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా (Santosham Sagam Balam, Chirunavvuto Movie Song)

Posted in Misc at 7:41 am by itsourteamwork

This is one of my favorite songs. Its good motivational song. Sorry for those who don’t understand Telugu Language…May be you can enjoy the quotes


సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా

సంగీతం నీ తొడై సాగవే గువ్వమ్మ

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి

ఓహో… ఓహో….

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే

రేపటి వైపుగా నీ చూపు సాగదుగా

నిన్నటి నీడలే కనుపాపని ఆపి

తేరేపటి వైపుగా నీ చూపు సాగదుగా

చుట్టమల్లే కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుకాళ్ళు కడిగి స్వాగతించకూ

ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండ లేని పోని సేవ చెయ్యకు

మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా

ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయదా

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి

ఓహో… ఓహో….

ఆశలు రేపిన అడియాశలు చూపిన

సాగే జీవితం అడుగైనా ఆగదుగా

ఆశలు రేపిన అడియాశలు చూపిన

సాగే జీవితం అడుగైనా ఆగదుగా

నిన్న రాత్రి పీడ కళ నేడు తలుసుకుంటు నిద్ర మానుకోగలమా

ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటు లేవకుండ ఉండగలమా

కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా

కలతలని నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి

ఓహో… ఓహో….

July 19, 2011

Can Sachin Score 100th Century in Lords?

Posted in Cricket, Sports tagged , , , , at 7:02 am by itsourteamwork

Can, the master blaster, god of cricket, score his 100th Century in Lords in the prestigious 2000th (or 1999?) test match?

Like the Indian cricket fans, whole cricket world is looking at him for his 100th century.

Please Sachin, score this memorable century in Lords.

April 3, 2011

Thanks India For Winning the World Cup

Posted in Cricket, Sports tagged , , , at 2:17 pm by itsourteamwork

Thanks India for winning the world cup.

Next page